జక్కన్న ఫాదర్ ఆ ప్రాజెక్ట్ వెనకాల ఉన్నాడట
TOLLYWOOD
 TOPSTORY

జక్కన్న ఫాదర్ ఆ ప్రాజెక్ట్ వెనకాల ఉన్నాడట

Murali R | Published:June 19, 2017, 12:00 AM IST
అగ్ర నిర్మాత అల్లు అరవింద్ భారీ ఎత్తున '' రామాయణం '' ని తీయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే . దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం బాలీవుడ్ వాళ్ళ సహకారం తీసుకుంటున్నాడు కూడా . అయితే రామాయణం కథా వస్తువుగా తీసుకున్నారు కానీ అందులో ఏ భాగాలూ ఉండాలి , స్క్రీన్ ప్లే ఏంటి ? అన్నదాని పై చర్చలు జరుపుతున్నారు అల్లు అరవింద్.

అయితే దానికోసం బాలీవుడ్ రచయితల సహకారం కోరాడట కానీ వాళ్ళు చేతులెత్తేసి మాకంటే మీ దగ్గర ఉన్న విజయేంద్ర ప్రసాద్ సహకారం తీసుకోండి బెటర్ అని సలహా ఇచ్చారట . దాంతో అల్లు అరవింద్ విజయేంద్రప్రసాద్ దగ్గరకు వెళ్లి రామాయణం కోసం స్క్రీన్ ప్లే రూపొందించాలని కోరాడట ఇంకేముంది విజయేంద్ర ప్రసాద్ దానికి అంగీకరించాడట కూడా . బాహుబలి తో విజయేంద్ర ప్రసాద్ రేంజ్ పెరిగింది.Comments

FOLLOW
 TOLLYWOOD