అయ్యో ! సినిమా రిలీజ్ ఆగిపోయింది
TOLLYWOOD
 TOPSTORY

అయ్యో ! సినిమా రిలీజ్ ఆగిపోయింది

Murali R | Published:October 26, 2017, 8:04 PM IST
తమిళంలో సంచలన విజయం సాధిస్తూ అప్పుడే 150 కోట్ల వసూళ్ల ని దాటేసింది విజయ్ నటించిన '' మెర్సల్ '' చిత్రం . తమిళం తో పాటే తెలుగులో కూడా ఒకే రోజున రిలీజ్ చేయాలనుకున్నారు కానీ సెన్సార్ సమస్య కారణంగా తెలుగులో ఈనెల 27 నాటికి వాయిదా పడింది అంటే రేపే రిలీజ్ అన్నమాట ! కానీ రేపు కూడా అదిరింది సినిమా రిలీజ్ కావడం లేదు ఎందుకంటే సెన్సార్ సమస్యల్లో చిక్కుకుంది అదిరింది చిత్రం . కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న డైలాగ్స్ ని తొలగిస్తేనే సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని లేకపోతే లేదని తేల్చి చెప్పడంతో విజయ్ నటించిన అదిరింది పోస్ట్ పోన్ అయ్యింది.

జి ఎస్ టి కి వ్యతిరేకంగా అదిరింది చిత్రంలో డైలాగ్స్ ఉండటం వల్ల తమిళనాట పెద్ద గందరగోళమే అయ్యింది , కాగా ఇప్పుడు తెలుగునాట అది రిపీట్ కాకుండా ఆ డైలాగ్స్ ని తీసేయాలని సెన్సార్ సభ్యులు కోరుతున్నారట . అయితే నిర్మాత మాత్రం ఒప్పుకోవడం లేదు దాంతో అదిరింది రేపు రిలీజ్ కావడం లేదు.Comments

FOLLOW
 TOLLYWOOD