మూడేళ్ళ దాకా పెళ్లి చేసుకోదట.. మరి విశాల్
TOLLYWOOD
 TOPSTORY

మూడేళ్ళ దాకా పెళ్లి చేసుకోదట.. మరి విశాల్

Murali R | Published:March 20, 2017, 12:00 AM IST
మూడేళ్ళ దాకా పెళ్లి చేసుకునేది లేదని ఖరా ఖండి గా చెప్పేసింది శరత్ కుమార్ కూతురు తమిళ హీరోయిన్ వరలక్ష్మి . హీరో విశాల్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ భామ కొద్దిరోజుల క్రితం అతడితో బ్రేకప్ అయ్యిందని గుసగుసలు వస్తున్నాయి . మా ఇద్దరి మధ్య ఏమి లేదు కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని అంటుంటారు కానీ ఇంకా ఏదో ఉందని తమిళనాట గుసగుసలు విపరీతంగా వస్తూనే ఉన్నాయి . ఆ గుసగుసలను పక్కన పెడితే ఈమధ్య '' సేవ్ శక్తి '' అంటూ మహిళల పై జరుగుతున్న అరాచకాలపై పోరాటం ప్రారంభించింది వరలక్ష్మి . 
 
 

హీరోయిన్ గా అనుకున్నంత సక్సెస్ కాలేదు కానీ విశాల్ తో ప్రేమాయణం సాగించి వార్తల్లోకి ఎక్కి చాలా ఫెమస్ అయ్యింది ఈ భామ . తాజాగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలను నిరోధించడానికి నడుం బిగించింది వరలక్ష్మి . అయితే పెళ్లి మాట ఎత్తితే మరో మూడేళ్ళ వరకు పెళ్లి చేసుకోను అని అంటోంది మరి విశాల్ పరిస్థితి ఏంటో ? ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో .
Comments

FOLLOW
 TOLLYWOOD