రాళ్లతో కొట్టుకున్న పవన్ మహేష్ ఫ్యాన్స్
TOLLYWOOD
 TOPSTORY

రాళ్లతో కొట్టుకున్న పవన్ మహేష్ ఫ్యాన్స్

Murali R | Published:September 8, 2017, 12:00 AM IST
పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు అభిమానుల మధ్య గతకొంతకాలంగా యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు పవన్ - మహేష్ అభిమానులు కొట్టుకోగా తాజాగా ముమ్మిడివరం మండలం లోని అనాత వరం గ్రామంలో రాళ్లతో , కర్రలతో కొట్టుకొని సంచలనం సృష్టించారు. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది.

గణేష్ నిమజ్జనం సందర్భాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు మహేష్ ఫ్యాన్స్ అయితే ఆ బాణసంచా కారణంగా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు కాలిపోయాయి ఇంకేముంది పవన్ ఫ్యాన్స్ కి కోపం వచ్చింది. మీరు కావాలనే పవన్ ఫ్లెక్సీలను తగులబెట్టారు అంటూ మహేష్ ఫ్యాన్స్ తో గొడవకు దిగారు పవన్ ఫ్యాన్స్. దాంతో ఇరు వర్గాలు రెచ్చిపోయి రాళ్లతో , కర్రలతో దాడులు చేసుకోగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గాయపడినవాళ్ళు. గొడవ పెద్దది కావడంతో పోలీసులు, గ్రామ పెద్దలు కలగజేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Related Links

Mahesh Babu praises Arjun Reddy
maheshbabu new movie opening news
Pawan Kalyan unhappy with BJPComments

FOLLOW
 TOLLYWOOD