నాగచైతన్య అల్లరి నరేష్ లలో కొట్టేది ఎవరు
TOLLYWOOD
 TOPSTORY

నాగచైతన్య అల్లరి నరేష్ లలో కొట్టేది ఎవరు

Murali R | Published:September 6, 2017, 12:00 AM IST
సెప్టెంబర్ 8న నలుగురు హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయాలనీ భావించారు కానీ తీరా సమయానికి ఇద్దరు హీరోలు వెనుకబడి పోవడంతో ఇద్దరు మాత్రమే పోటీలో మిగిలారు . అల్లరి నరేష్ - అక్కినేని నాగచైతన్య లు పోటీ పడుతున్నారు . అయితే అక్కినేని నాగచైతన్య గతకొంత కాలంగా సక్సెస్ లు సాధిస్తూనే ఉన్నాడు ఇక హిట్ కొట్టాల్సింది అల్లరి నరేష్ మాత్రమే ! అల్లరి నరేష్ కు గత ఐదేళ్లు గా హిట్ అనే విషయం తెలీదు . వచ్చిన సినిమాలన్నీ ప్లాప్ అవుతూ అదే బాటలో పోతున్నాయి.

దాంతో ఇప్పుడు కాస్త రూటు మార్చి రీమేక్ మీద పడ్డాడు . మేడ మీద అబ్బాయి అంటూ ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు . అదేరోజున నాగచైతన్య నటించిన '' యుద్ధం శరణం '' అంటూ వస్తున్నాడు . మరి ఈ ఇద్దరిలో ఏ హీరో విజయం సాధిస్తాడో  చూడాలి . రెండు సినిమాలు ఒకేరోజున రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇద్దరు హీరోలలో హిట్ కొట్టేది ఎవరో ?

Related Links

Nagachaitanya used Baahubali
War between Nagachaitanya and Allari Naresh
Naga Chaitanya Rarandoi Veduka Chudham Telugu Movie ReviewComments

FOLLOW
 TOLLYWOOD