ఎన్టీఆర్ - మహేష్ లలో గెలిచేది ఎవరు
TOLLYWOOD
 TOPSTORY

ఎన్టీఆర్ - మహేష్ లలో గెలిచేది ఎవరు

Murali R | Published:September 13, 2017, 12:00 AM IST
ఈనెల 21న ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం రిలీజ్ అవుతుండగా , 27న మహేష్ నటించిన స్పైడర్ చిత్రం రిలీజ్ అవుతోంది . అంటే వారం రోజుల గ్యాప్ లో ఇద్దరు అగ్ర హీరోలు పోటీ పడుతున్నారు . అది కూడా సెలవులు ఇచ్చిన సమయంలో రిలీజ్ అవుతున్న సినిమాలు కాబట్టి కలెక్షన్ల కుంభ వృష్టి కురవడం ఖాయం . సినిమా ఎలా ఉన్నప్పటికీ మొదటి రోజు , మొదటి మూడు రోజులు అలాగే మొదటి వారం వసూళ్ల లో రెండు సినిమాలు కూడా భారీ వసూళ్లని సాధించడం ఖాయం.

అయితే ఏదైనా ఒక సినిమా బాగోలేకపోతే మరో సినిమాకు బాగా అడ్వాంటేజ్ అవుతుంది , ఒకవేళ రెండు సినిమాలు బాగుంటే రెండు సినిమాలకు కూడా విపరీతమైన కలెక్షన్లు వస్తాయి . అయితే ఎన్టీఆర్ - మహేష్ లలో ఎక్కువ వసూళ్లు రాబట్టేది ఎవరు ? సూపర్ హిట్ కొట్టేది ఎవరు అన్న పోటీ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది . ఎందుకంటే రెండు సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి . మరి ఈ రెండు సినిమాలలో.......  ఎన్టీఆర్ - మహేష్ లలో గెలిచేది ఎవరో తెలియాలంటే ఈనెల ఆఖరు వరకు వెయిట్ చేయాల్సిదే. Comments

FOLLOW
 TOLLYWOOD