డిజాస్టర్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చి రిస్క్ చేస్తాడా
TOLLYWOOD
 TOPSTORY

డిజాస్టర్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చి రిస్క్ చేస్తాడా

Murali R | Published:October 21, 2017, 10:29 AM IST
కృష్ణవంశీ సీనియర్ దర్శకుడు , తెలుగు సాంప్రదాయాలను ఉట్టిపడేలా చిత్రాలను తీస్తాడు ........ బంధాలు అనుబంధాలు ఎలా ఉంటాయో తన చిత్రాల ద్వారా చాటి చెబుతాడు కూడా కానీ సక్సెస్ రేటు లేదు . గతకొంతకాలంగా చిత్రాలు చేస్తున్నాడు కానీ ఒక్కటంటే ఒక్కటీ హిట్ లేదు పైగా ఇటీవల వచ్చిన నక్షత్రం పెద్ద డిజాస్టర్ దాంతో అతడి తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకు రావడం లేదు హీరోలు కూడా . అయితే గోపీచంద్ మాత్రం కొద్దిగా ఆలోచన చేస్తున్నాడట కృష్ణవంశీ తో సినిమా చేసే విషయంలో . 
 
 
గోపీచంద్ కూడా గతకొంతకాలంగా సినిమాలు హిట్ కాక ఇబ్బంది పడుతున్నాడు , పైగా కృష్ణవంశీ తో కలిసి గోపీచంద్ చేసిన '' మొగుడు '' చిత్రం అతిపెద్ద డిజాస్టర్ అయ్యింది . ఆ చేదు అనుభవం దృష్ట్యా మళ్ళీ కృష్ణవంశీ తో గోపీచంద్ సినిమా చేస్తాడా ? అన్నది చూడాలి . అలాగే ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయాలనీ అనుకున్నా అంతటి రిస్క్ తీసుకునే నిర్మాత ఎవరు ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే ! Comments

FOLLOW
 TOLLYWOOD