నిహారిక హీరోయిన్ గా సక్సెస్ అవుతుందా
TOLLYWOOD
 TOPSTORY

నిహారిక హీరోయిన్ గా సక్సెస్ అవుతుందా

Murali R | Published:September 29, 2017, 3:46 AM IST
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే. మెగా కుటుంబం నుండి వస్తున్న హీరోయిన్ కావడంతో పెద్ద సంచలనమే అయ్యింది. అయితే ఒక మనసు చిత్రం మాత్రం ఘోర పరాజయం పొందింది. దాంతో షాక్ తిన్న మెగా కుటుంబం కొద్ది రోజుల కు కానీ ఆ షాక్ నుండి బయట పడలేదు .అలాగే నిహారిక కూడా కొంత గ్యాప్ తీసుకొని షాక్ నుండి కోలుకుంది.

ఇష్టపడి చేసిన సినిమా డిజాస్టర్ కావడంతో ఈసారి జాగ్రత్తలు తీసుకొని మరీ సినిమా చేయడానికి రెడీ అయ్యింది. సుమంత్ అశ్విన్ లాంటి చిన్న హీరో సరసన నటించడానికి సమాయత్తం అవుతోంది. మరి ఈ సినిమా కూడా రొమాన్స్ కథాంశం గా తెరకెక్కుతుందట .నిహారిక కథానాయికగా సక్సెస్అవుతుందా ? లేదా? అన్నది సుమంత్ అశ్విన్ సినిమాతో తేలిపోనుంది ఎందుకంటే ఆ సినిమాకు భాగస్వామి సక్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ కావడం గమనార్హం. Comments

FOLLOW
 TOLLYWOOD