ఆ డైరెక్టర్ మంచి చిత్రాలే చేసాడు కానీ
TOLLYWOOD
 TOPSTORY

ఆ డైరెక్టర్ మంచి చిత్రాలే చేసాడు కానీ

Murali R | Published:August 16, 2017, 12:00 AM IST
చంద్రశేఖర్ ఏలేటి మంచి దర్శకులే , ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలు కూడా ఫరవాలేదనిపించాయి , అందులో కొన్ని మంచి చిత్రాలు ఉన్నాయి కానీ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం లో వచ్చిన ఏ సినిమా కూడా కమర్షియల్ గా హిట్ కాలేదు , నిర్మాతలకు లాభాలు రాలేదు దాంతో ఇతగాడి కి ఎప్పుడో ఒక సినిమా వస్తుంది . దర్శకుడి గా పరిచయం అయి 14 ఏళ్ళు కానీ దర్శకత్వం వహించిన చిత్రాలు మాత్రం ఏడు మాత్రమే !.

అయితే అలాంటి ఈ దర్శకుడి తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేయాలని అనుకుంటున్నట్లు ఫిలింనగర్ లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి . ఎన్టీఆర్ అంటే మాస్  , చంద్రశేఖర్ ఏలేటి క్లాస్ మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే బాక్సాఫీస్ ని షేక్ చేసేలా ఉండాలి , లేకపోతే అది ఎన్టీఆర్ పై ఎఫెక్ట్ పడటం ఖాయం . ఎన్టీఆర్ ఇతడి తో పని చేయడం అంటే పెద్ద రిస్క్ తీసుకున్నట్లే !ఎన్టీఆర్  రిస్క్ తీసుకుంటాడా ? లేదా ? చూడాలి.Comments

FOLLOW
 TOLLYWOOD