ఎన్టీఆర్ బుల్లితెరపై సక్సెస్ అవుతాడా
TOLLYWOOD
 TOPSTORY

ఎన్టీఆర్ బుల్లితెరపై సక్సెస్ అవుతాడా

Murali R | Published:July 15, 2017, 12:00 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా బిగ్ బాస్ రియాలిటీ షో చేయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే . ఇక రేపే ఆ షో స్టార్ మా లో ప్రారంభం కానుంది . మొదటి ఎపిసోడ్ కావడంతో ఈనెల 12 , 13 తేదీలలో ఎన్టీఆర్ పై ఆ దృశ్యాలను చిత్రీకరించారు . బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది ఈ బిగ్ బాస్ కానీ దక్షిణాదిన అందునా తమిళనాట కమల్ హాసన్ షో నిర్వహిస్తున్నప్పటికీ , భారీ అందాల భామ నమిత కూడా ఉన్నప్పటికీ ఆ షోకి కనీస రేటింగ్ కూడా రాలేదు . డిజాస్టర్ అయ్యింది దాంతో ఎన్టీఆర్ బిగ్ బాస్ షో పై నీలినీడలు కమ్ముకున్నాయి.

తమిళనాట ప్లాప్ అయి , వివాదాలలో చిక్కుకున్న బిగ్ బాస్ షో తెలుగునాట హిట్ అవుతుందా ? ఎన్టీఆర్ బుల్లితెరపై సక్సెస్ అవుతాడా ? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారిపోయింది . ఇక వాటికీ సమాధానం రేపు రాత్రికి తేలిపోనుంది . ఎందుకంటే రేపు రాత్రే ఈ షో ప్రారంభం కానుంది మరి.Comments

FOLLOW
 TOLLYWOOD