ఎన్టీఆర్ కు ఫిల్మ్ ఫేర్ రావడం ఖాయమా
TOLLYWOOD
 TOPSTORY

ఎన్టీఆర్ కు ఫిల్మ్ ఫేర్ రావడం ఖాయమా

Murali R | Published:May 18, 2017, 12:00 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కన్నడ నాట ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చేలా ఉంది . ఎన్టీఆర్ తెలుగు హీరో అయితే కన్నడ నాట ఫిలిం ఫేర్ రావడం ఏంటి ? ఆశ్చర్య పోతున్నారా ? కన్నడ సినిమాలో గత ఏడాది ఎన్టీఆర్ పాట పాడిన విషయం తెలిసిందే . ఆ పాట అక్కడ సూపర్ హిట్ అయ్యింది కాగా ఇప్పుడు ఎన్టీఆర్ పాడిన పాట ఫిలిం ఫేర్ అవార్డు కి నామినేట్ అయ్యింది . పాట కూడా సూపర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ కు తప్పకుండా సింగర్ గా అవర్డు రావడం ఖాయమని అంటున్నారు .

ఎన్టీఆర్ ప్రస్తుతం జై లవకుశ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ రేపు రిలీజ్ కానుంది . ఎల్లుండి ఎన్టీఆర్ పుట్టినరోజు కాబట్టి రేపు ఎన్టీఆర్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు.Comments

FOLLOW
 TOLLYWOOD