మహేష్ ఆ సినిమా చేస్తాడా
TOLLYWOOD
 TOPSTORY

మహేష్ ఆ సినిమా చేస్తాడా

Murali R | Published:October 11, 2017, 8:45 PM IST
మహేష్ అంటేనే వివాదాలకు దూరంగా ఉండే హీరో అన్న విషయం తెలిసిందే . అలాంటిది మహేష్ వివాదాస్ప చిత్రం చేస్తే అద్భుతంగా ఉంటుందని అంటున్నాడు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. వివాదాస్పద చిత్రం ఏంటి ? మహేష్ మాత్రమే ఎందుకు చేయాలి అని అనుకుంటున్నారా? 
 
 
ఛత్రపతి శివాజీ చిత్రం చేయాలని సూపర్ స్టార్ కృష్ణ అనుకున్నాడు అయితే మరాఠా పోరాట యోధుడు అయిన శివాజీ సినిమా చేస్తే ఎక్కడ ఒక వర్గం ప్రజలను తక్కువచేసి చూపించినట్లు అవుతుందో ఏమో అన్న భయంతో కృష్ణ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టాడు . కట్ చేస్తే ఇప్పుడు మహేష్ బాబు ఛత్రపతి శివాజీ పాత్ర పోషిస్తే తప్పకుండా ప్రభంజనం సృష్టించడం ఖాయమని అంటున్నాడు గోపాలకృష్ణ . ఈ రచయిత చెప్పేది బాగానే ఉంది కాని మహేష్ ఈ చిత్రం చేస్తాడా ? అంటే డౌటే ..... ఎందుకంటే మహేష్ వివాదాస్పద హీరో కాదు కాబట్టి . Comments

FOLLOW
 TOLLYWOOD