మగధీర 2 కి కథ రాస్తాడట
TOLLYWOOD
 TOPSTORY

మగధీర 2 కి కథ రాస్తాడట

Murali R | Published:September 12, 2017, 12:00 AM IST
2009 లో రిలీజ్ అయిన మగధీర ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఇన్నాళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ కథ రాస్తానని అందులో ఒక్క రాంచరణ్ మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి కూడా నటిస్తాడాని అంటున్నాడు బాహుబలి కథకుడు విజయేంద్ర ప్రసాద్. పలు సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ మగధీర చిత్రానికి కథ అందించిన విషయం తెలిసిందే.  అప్పట్లో తెలుగు చలనచిత్ర రికార్డులను అన్నింటినీ బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది.
 
 

మగధీర సీక్వెల్ అంటే మెగా అభిమానులకు పండగే పండగ. అయితే ఇది శుభావార్తే కానీ ఇది ఇప్పుడే నెరవేరేలా లేదు ఎందుకంటే చరణ్ బిజీ గా ఉన్నాడు అలాగే చిరంజీవి కూడా . పైగా కథ సిద్ధం కావాలి , అంటే విజయేంద్ర ప్రసాద్ కథ రాయాలి. రాజమౌళి దర్శకత్వం వహించాలి కాబట్టి కొంత సమయం పడుతుంది. కాస్త ఆలస్యమైనా మగధీర సీక్వెల్ వస్తే మంచిదే కదా .
Comments

FOLLOW
 TOLLYWOOD