జగన్ కు షాక్ ఇస్తోంది
TOLLYWOOD
 TOPSTORY

జగన్ కు షాక్ ఇస్తోంది

Murali R | Published:July 15, 2017, 12:00 AM IST
కర్నూల్ పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక జగన్మోహన్ రెడ్డి కి షాక్ ఇచ్చింది . ఎంపీగా గెలిచిన తొలినాళ్ళ లోనే తెలుగుదేశం పార్టీ లోకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న రేణుక ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది . పార్లమెంట్ లో పలు సమస్యలను ప్రస్తావించి మంచి వక్త అనిపించుకున్న రేణుక తాజాగా నారా లోకేష్ తో సమావేశం కావడం సంచలనం సృష్టిస్తోంది.

నారా లోకేష్ తో సమావేశం కావడానికి ముందు ఎంపీల సమావేశం నిర్వహించాడు జగన్ అయితే ఆ సమావేశానికి డుమ్మా కొట్టి మరీ నారా లోకేష్ ని కలిసింది దాంతో రేణుక పచ్చజెండా పంచన చేరడం ఖాయంగా కనిపిస్తోంది . పైగా ఇప్పటికే ఆమె భర్త తెలుగుదేశం పార్టీ లో ఉన్నాడు అంతేకాకుండా నంద్యాల ఉప ఎన్నిక కూడా ఉంది దాంతో ఈ ఇద్దరి భేటీ కి ప్రాధాన్యత ఏర్పడింది.Comments

FOLLOW
 TOLLYWOOD