సినీ కార్మికుల సమస్యలపై స్పందించిన ఎఫ్ డిసి చైర్మన్


fdc-chairman-responded-to-the-problems-of-film-workersసినీ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్న తెలంగాణ ఎఫ్ డి సి చైర్మన్ పి . రామ్మోహన్ రావు త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు . ఈరోజు ఉదయం ఎఫ్ డి సి కార్యాలయంలో జరిగిన సమావేశంలో 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులతో పాటుగా చిత్రపురి హిల్స్ అధ్యక్షుడు కొమర వెంకటేష్ కూడా పాల్గొన్నాడు . సినిమా రంగంలోని 24 విభాగాలలో పనిచేస్తున్న కార్మికులు అనారోగ్య బారిన పడితే ఆదుకునే వారు కరువయ్యారని ,

అలాగే ఏదైనా ప్రమాదం జరిగితే కొన్ని నెలల పాటు ఆ కార్మికుడి కుటుంబం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతోందని ఈ విషయంలో ఎఫ్ డిసి చైర్మన్ కలుగజేసుకొని నిర్మాతల దగ్గర నుండి నష్టపరిహారం ఇప్పించాలని కోరగా వెంటనే స్పందించిన చైర్మన్ రామ్మోహన్ ఆ ఏర్పాటు తో పాటుగా సినీ కార్మికుల అందరి కోసం చిత్రపురి కాలనీ లో హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా త్వరలోనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు . సినీ కార్మికుల సమస్యల ను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడమే కాకుండా కార్మికుల కోసం హాస్పిటల్ నిర్మాణానికి పూనుకుంటున్న రామ్మోహన్ రావు గారికి కృతఙ్ఞతలు తెలియజేసారు సినీ కార్మికుల నాయకులు .