పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు పెట్టిన రవిప్రకాష్


TV9 CEO Ravi Prakash to file criminal Case on Pawan Kalyan తన ఇమేజ్ ని మంటగలుపుతూ ఓ మార్ఫింగ్ వీడియో సృష్టించి దాన్ని సోషల్ మీడియాలో పెట్టిన పవన్ కళ్యాణ్ పై తగిన చర్యలు తీసుకోవాలంటూ క్రిమినల్ కేసు పెట్టాడు టివి 9 సి ఈ ఓ రవిప్రకాష్ . 420 , 468, 471, 474 R/ W 120 B సెక్షన్ ల కింద కేసు పెట్టాడు రవిప్రకాష్ . పవన్ కళ్యాణ్ కొన్ని ఛానళ్ల ని బాయ్ కాట్ చేయాలనీ తన అభిమానులకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే దాంతో టివి 9 కూడా ఉంది .

తెలుగుదేశం పార్టీ తో కుమ్మక్కయి తన ప్రతిష్టని దెబ్బ తీయాలని చూస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేయడమే కాకుండా రవిప్రకాష్ కాళ్ళు ఎవరో మొక్కుతూ వేడుకుంటున్న వీడియో ని పవన్ కళ్యాణ్ లీక్ చేసిన విషయం తెలిసిందే . ఆ లీక్ వీడియో పై రవిప్రకాష్ మరింత ఆగ్రహంగా ఉన్నాడు అందుకే పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు పెట్టాడు . జనసేన అంటూ రాజకీయ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కు అప్పుడే ఇబ్బందులు మొదలయ్యాయి . మునుముందు ఎలా ఉంటుందో చూడాలి .