ఉగాది ప‌ర్వ‌దినాన జె.డి.చక్ర‌వ‌ర్తి, అమ్మారాజ‌శేఖ‌ర్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న‌ ‘ఉగ్రం’ ఫస్ట్ లుక్ విడుదల


ugram-firstlook-on-ugadiనక్షత్ర మీడియా పతాకంపై ఖాసిం సమర్పణలో జె.డి. చక్రవర్తి హీరోగా, అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో ‘నక్షత్ర’ రాజశేఖర్ నిర్మించిన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘ఉగ్రం’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉగాది పర్వదినాన ఉగ్రం ఫస్ట్ లుక్ ని విడుద‌ల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమంలో హీరో జెడి చక్రవర్తితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు సంప్రదాయ పంచెకట్టుతో వచ్చి సందడి చేశారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ఈ స‌మ్మ‌ర్ కానుక‌గా చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా

హీరో జెడి చక్రవర్తి మాట్లాడుతూ… ఉగాది రోజున ఉగ్రం చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నిర్మాతలు చాలా చాలా కష్టపడి ఇష్టపడి చేసిన చిత్రం ఉగ్రం. ఈ సినిమా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చే చిత్రం అవుతుంది. హీరోయిన్ చాలా బాగా చేసింది. ఆర్.పి. చమ్మక్ చంద్ర క్యారెక్టర్స్ సూపర్బ్ గా వచ్చాయి. ఈ సినిమాకు మీ పుల్ సపోర్ట్ కావాలి. అని అన్నారు.

దర్శకుడు అమ్మా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఉగాది పండగకు మా ఉగ్రం చిత్రానికి సంబంధం ఉంది. ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనం. అలాగే మా సినిమాలో కూడా నవ రసాలుంటాయి. అలాంటి ఉగాది రోజున ఉగ్రం ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక ఉగ్రం చిత్రం మేం అనుకున్నదానికంటే చాలా బాగా వస్తోంది. దానికి కారణం నా గురువు జెడి చక్రవర్తి మెయిన్ రీజన్. రణం తర్వాత నాకు సెకండ్ ఇన్నింగ్స్ ఈ సినిమా. ఆయన క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాతో హీరోయిన్ కు, ఆర్.పి, చమ్మక్ చంద్రకు చాలా మంచి పేరొస్తుంది. మా నిర్మాతల సపోర్ట్ వల్లే ఈ సినిమాను ఇంత బాగా తీయగలుగుతున్నాను.

చిత్ర నిర్మాత నక్షత్ర రాజశేఖర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించిన‌ జెడి చక్రవర్తి మరో పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ఉగ్రం. జె.డి.చక్రవర్తి కెరీర్లో ఉగ్రం ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని ధీమాగా చెప్పగలం. యూత్ ని విప‌రీతం గా ఆక‌ట్టుకునే చిత్రం గా మా ఉగ్రం వుండ‌బోతుంది. అలానే మాస్ ఇమేజ్ వున్న ద‌ర్శ‌కుడు అమ్మ రాజశేఖర్ చెప్పిన కథకు ఎంతో ఇన్‌స్పైర్ అయ్యి ఆయన నటించిన చిత్రమిది. యాక్షన్‌కు, నేపథ్య సంగీతానికి మంచి స్కోప్ ఉన్న చిత్రమిది. ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది. తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన ఉగాది పర్వదినాన మా ఉగ్రం చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఉగ్రం మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా మా దర్శకుడు అమ్మ రాజశేఖర్ తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రంగా ఉగ్రం తప్పకుండా నిలుస్తుంది. ద‌ర్శ‌కుడు ఊహ‌కి మా సినిమాటోగ్రాఫ‌ర్స్ అంజి, ఎస్ ముజీర్ మాలిక్ లు ప్రాణం పోసారు. క‌మ‌ర్ష‌య‌ల్ చిత్రాలు ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కి మా చిత్రం ఫీస్ట్ లా వుండ‌బోతుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి స‌మ్మ‌ర్ లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నాము’’ అని అన్నారు.

 

నటీనటులు

జెడి చక్రవర్తి, అక్షిత, మనోజ్ నందం, అక్షత, బెనర్జీ, ఆర్ పి, ఛమ్మక్ చంద్ర, శ్రీరామ్ చంద్ర, టార్జాన్, సంపూర్ణేష్ బాబు, షానీ, రాజు భాయ్