బాలయ్య కోసం వెంకటేష్ త్యాగం


నటసింహం నందమూరి బాలకృష్ణ కోసం తన సినిమాని వాయిదా వేసుకొని త్యాగానికి సిద్ధమయ్యాడు సీనియర్ హీరో వెంకటేష్. నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో సూపర్ హిట్ కొట్టి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చాడు దర్శకుడు తేజ. దాంతో అతడితో సినిమాలు చేయడానికి పలువురు హీరోలు పోటీపడుతున్నారు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ చేసే గొప్ప ఛాన్స్ తేజ కు ఇచ్చాడు బాలయ్య.

 

అయితే అదే సమయంలో మరో సీనియర్ హీరో వెంకటేష్ తో సినిమా చేసే అవకాశం కూడా వచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ ఆలస్యం అవుతుంది కాబట్టి ఈలోపు వెంకటేష్ తో సినిమా చేసేద్దాం అనుకున్నాడు తేజ. కానీ బాలయ్య నటించనున్న ఎన్టీఆర్ బయోపిక్ మార్చిలో ప్రారంభం అవుతోంది. మార్చి అంటే మరో రెండు నెలల సమయం కూడా లేదు కాబట్టి వెంటవెంటనే మరో సినిమా చేయడం వల్ల అందరికీ ఇబ్బంది కాబట్టి ముందు బాలయ్య సినిమా కంప్లీట్ చేసి రా …. ఆ తర్వాత మన సినిమా చేద్దామని చెప్పాడట వెంకటేష్. బాలయ్య కు అలాగే వెంకటేష్ ల మధ్య మంచి స్నేహం ఉండటంతో బాలయ్య కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడట వెంకీ.