విజయ్ దేవరకొండ తమ్ముడు కూడా హీరోనా


vijay devarakonda brother anand devarakonda ready to launchవిజయ్ దేవరకొండ తమ్ముడు కూడా హీరో గా పరిచయం కానున్నట్లు తెలుస్తోంది . సినిమారంగం అంటేనే వారసుల రాజ్యం కాగా ఆ వారసుల రాజ్యం లోకి విజయ్ దేవర కొండ తమ్ముడు ” ఆనంద్ దేవరకొండ ” కూడా రానున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి . ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ నటనలో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది , అతడ్ని ఓ బడా నిర్మాణ సంస్థ హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోందట ! అందులో భాగంగానే ఆనంద్ కు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం .

పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాలతో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ తాజాగా మహానటి చిత్రంతో కూడా ప్రేక్షకులను అలరించాడు . అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ అనూహ్యంగా పెరిగిపోయింది . ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీ గా ఉన్నాడు ఈ హీరో . ఇలాంటి పరిస్థితిలో విజయ్ తమ్ముడు ఆనంద్ వస్తే అన్నాదమ్ముల మధ్య పోటీ ఉంటుందా ? లేదా ? చూడాలి .