స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ


vijay devarakonda hottest desirable hero 2017పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాలతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది . అర్జున్ రెడ్డి కి ముందు విజయ్ దేవరకొండ వేరు అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఇమేజ్ వేరు దాంతో స్టార్ ల జాబితాలో చేరిపోయాడు విజయ్ . ఇక తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం షాక్ ఇచ్చాడు ఈ హీరో . టాలీవుడ్ టాప్ స్టార్ లైన మహేష్ బాబు , ప్రభాస్ , రాంచరణ్ , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , రానా లాంటి హీరోలను వెనక్కి నెట్టి ఓ సంస్థ ఇచ్చిన ” మోస్ట్ డిజైరబుల్ మెన్ 2017” కి గాను నెంబర్ టూ ప్లేస్ ని సొంతం చేసుకొని టాప్ స్టార్ లకు షాక్ ఇచ్చాడు .

 

మొదటి స్థానంలో రియాలిటీ షోలలో పాల్గొనే బషీర్ అలీ నిలవగా రెండో స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచాడు . ఇక ఆ తర్వాతి స్థానాల్లో ప్రభాస్ , మహేష్ బాబు , రాంచరణ్ ,అల్లు అర్జున్ , రానా , ఎన్టీఆర్ లు నిలిచారు . ఇదే పూర్తిస్థాయి కొలమానం కాదు కానీ విజయ్ దేవరకొండ స్థాయి మాత్రం పెరుగుతోంది అనడానికి ఇది నిదర్శనం .