రాంగోపాల్ వర్మ కు షాక్ ఇచ్చిన అర్జున్ రెడ్డి


vijay devarakonda rejected ramgopal varmas offerఅర్జున్ రెడ్డి చిత్రం విడుదల కు ముందు పలు వివాదాల్లో చిక్కుకుంది కాగా ఆ వివాదాల సమయంలో అర్జున్ రెడ్డి చిత్రానికి అండగా నిలబడింది దర్శకులు రాంగోపాల్ వర్మ . దాంతో వర్మ కు అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ కు మంచి స్నేహం పెరిగింది . అయితే అర్జున్ రెడ్డి హిట్ కావడంతో విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేయాలనీ ప్లాన్ చేసాడట రాంగోపాల్ వర్మ . ఇదే విషయాన్నీ హీరో విజయ్ దేవరకొండ కు చెబితే వెంటనే మీకు సినిమా చేయలేను సార్ అంటూ చెప్పేశాడట !

 

వర్మ అడిగితే నో చెప్పే హీరోలు అరుదు అనే చెప్పాలి దాంతో వర్మ షాక్ అయ్యాడట ! అయితే విజయ్ దేవరకొండ వర్మ కు నో చెప్పడానికి కారణం అతడికి సక్సెస్ లేదు అనేది కాదు సుమా ! ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీ గా ఉన్నాడు విజయ్ దాంతో ఇప్పట్లో డేట్లు కేటాయించేంత సమయం లేదు కాబట్టి ఇప్పుడు మాత్రం కుదరదు తర్వాత తప్పకుండా చేద్దాం అని అన్నాడట .