మహానటి సావిత్రి కథలో విలన్ ఎవరు ?


who is the villain in mahanati ? మహానటి సావిత్రి జీవితం విషాదం కావడంతో ఆమె పాలిట అసలు విలన్ ఎవరు ? అన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు . సావిత్రి జెమిని గణేశన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . జెమిని గణేశన్ సరైన వ్యక్తి కాదని , నీకు తగిన వ్యక్తి అస్సలు కాదని చాలామంది సావిత్రి ని హెచ్చరించారు కానీ సావిత్రి మాత్రం వాళ్ళ మాటలను పెడచెవిన పెట్టి అప్పటికే పెళ్ళైన జెమిని గణేశన్ ని రహస్య వివాహం చేసుకుంది . పెళ్లి చేసుకున్న మూడేళ్ళ తర్వాత మీడియా ముందుకు వచ్చి పెళ్లి విషయాన్నీ స్వయంగా వెల్లడించారు .

కొంతకాలం సావిత్రిజెమిని గణేశన్ ల కాపురం బాగానే సాగినప్పటికీ రొమాంటిక్ హీరో అయిన జెమిని గణేశన్ ఇతర మహిళలతో సంబంధాలు కొనసాగిస్తున్న విషయం సావిత్రి కి తెలియడంతో అతడికి దూరమయింది , విచిత్రం ఏంటంటే సావిత్రి కి అప్పటికే మద్యం ని అలవాటు చేసాడు భర్త అయిన జెమిని గణేశన్ . దాంతో మద్యానికి బానిస అయ్యింది అదే సమయంలో పక్కన ఉన్నవాళ్లు మోసం చేసి పెద్ద మొత్తంలో డబ్బుని స్వాహా చేయడం …… భారీ రెమ్యునరేషన్ అందుకునే సావిత్రి ఇంటి పై ఇన్ కం టాక్స్ అధికారులు రైడ్ చేసి విలువైన బంగారం , డబ్బు ని స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఇంకా పన్నులు కట్టాలని వేధించడం తో మరింత డిప్రెషన్ కి లోనయ్యింది . ఈ కష్టాలు సరిపోలేదన్నట్లుగా సొంతంగా చేసిన సినిమాలు పరాజయం పొందడంతో ఫైనాన్షియర్ల వేధింపులు తట్టుకోలేక ప్యాలెస్ ని అమ్మేసి మామూలు ఇంట్లోకి వెళ్లడం పిల్లల భవిష్యత్ కోసం వెంపర్లాడి మరింతగా దిగజారి మద్యానికి బానిసై 45 ఏళ్ల కే వందేళ్ల జీవితాన్ని చాలించింది . అతి మామూలు స్థాయి నుండి వచ్చిన సావిత్రి మహానటి గా ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకొని లెక్కలేని విధంగా అందరికీ సహాయం చేసి చివరకు నా అన్నవాళ్ళు లేక తనువూ చాలించింది . మహానటి సావిత్రి జీవితంలో జెమిని గణేశన్ , మద్యం , ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ వాళ్ళు అలాగే బంధువులు నమ్మిన వాళ్ళు ఇలా అందరూ విలన్ లుగా మారారు అయితే సావిత్రి ని నిర్లక్ష్యం చేసి మద్యానికి బానిస అయ్యేలా చేసిన జెమిని గణేశన్ అసలు సిసలైన విలన్ .