హిట్ కొట్టేది మహేష్ బాబు బావా ? ఎన్టీఆర్ అన్ననా ?


who will win sudheer babu or nandamuri kalyan ramఎన్టీఆర్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ” నా నువ్వే ” ఈనెల 14 న విడుదల అవుతోంది , కాగా ఆ మరుసటి రోజున మహేష్ బాబు బావ సుధీర్ బాబు నటించిన ” సమ్మోహనం ” సినిమా విడుదల అవుతోంది . రెండు రోజుల వ్యవధిలో రిలీజ్ అవుతున్న రెండు చిత్రాలపై కూడా పెద్దగా అంచనాలు లేవు ఎందుకంటే ఇద్దరు కూడా స్టార్ డం ని సొంతం చేసుకోలేక పోయారు దాంతో సినిమా బాగుంది అంటేనే థియేటర్ లలోకి జనాలు వస్తారు లేదంటే అంతేసంగతులు .

స్టార్ డం కోసం నందమూరి కళ్యాణ్ రామ్ , సుధీర్ బాబు లు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అంతగా కాలం కలిసి రావడం లేదు . ఇక ఈ రెండు చిత్రాల విషయానికి వస్తే ……. కళ్యాణ్ రామ్ సరికొత్తగా చేసిన చిత్రం ఈ ” నా నువ్వే ” . తమన్నా కథానాయిక ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం హిట్ అయితే కళ్యాణ్ రామ్ కు సరికొత్త జోనర్ లో హిట్ లభించినట్లు అవుతుంది ఎందుకంటే నందమూరి అంటేనే యాక్షన్ కాబట్టి . ఇక సుధీర్ బాబు చిత్రం సమ్మోహనం సినిమా నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం . అదితిరావు హైదరీ కథానాయిక . రెండు కూడా ప్రేమకథా చిత్రాలు కావడం , బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడంతో మహేష్ బాబు బావ హిట్ కొడతాడా ? ఎన్టీఆర్ అన్న హిట్ కొడతాడా ? చూడాలి . ఈ రెండు సినిమాలకు మంచి ఛాన్స్ లభించింది అయితే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే ఇద్దరూ హిట్ కొడతారు లేదంటే షరామామూలే !