డైరెక్టర్ గా నాగశౌర్య మెప్పిస్తాడా


will nagashourya get success with short filmహీరో నాగశౌర్య డైరెక్టర్ గా మారాడు . మెగా ఫోన్ చేతబట్టి స్టార్ట్ కెమెరా …… యాక్షన్ ….. కట్ అంటూ సరికొత్త పాత్రలోకి వెళ్ళాడు అయితే నాగశౌర్య డైరెక్టర్ అయ్యాడంటే సినిమా కోసం కాదు కేవలం షార్ట్ ఫిలిం కోసం అది కూడా వాళ్ళ అమ్మ కోసం . మే 13 మాతృ దినోత్సవం దాంతో ఆ సందర్బంగా అమ్మకు గిఫ్ట్ ఇవ్వాలని భావించిన నాగశౌర్య షార్ట్ ఫిలిం కి శ్రీకారం చుట్టాడు . ఈరోజు మాతృ దినోత్సవం కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భూమి అనే షార్ట్ ఫిలిం ని విడుదల చేయనున్నాడు .

ఇటీవలే ఛలో చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు నాగశౌర్య . ఆ సినిమా ఇచ్చిన విజయంతో అమ్మమ్మగారిల్లు చేసాడు అది విడుదలకు సిద్ధంగా ఉంది ఇక ఇప్పుడేమో నర్తనశాల చిత్రం చేస్తున్నాడు నాగశౌర్య . ఉష నాగశౌర్య తల్లి పైగా ఛలో చిత్రానికి నిర్మాత దాంతో అమ్మ కోసం భూమి అనే షార్ట్ ఫిలిం చేసాడు , మరి ఈ షార్ట్ ఫిలిం తో దర్శకుడిగా నాగశౌర్య మెప్పిస్తాడా చూడాలి .