పవన్ కళ్యాణ్ మంజుల కు ఛాన్స్ ఇస్తాడా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయాలనీ తహతహలాడుతోంది మహేష్ బాబు సోదరి మంజుల . నటిగా , నిర్మాతగా , ఇప్పుడు దర్శకురాలిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గడించింది మంజుల . తాజాగా మనసుకి నచ్చింది అనే సినిమాకు దర్శకత్వం వహించింది మంజుల త్వరలోనే ఆ సినిమా రిలీజ్ కానుంది . అయితే పవన్ కళ్యాణ్ కోసం ఓ కథ రెడీ చేసుకుందట ,అతడు కనుక కథ వింటే వెంటనే ఒప్పుకుంటాడు సినిమా చేయడానికి కానీ కథ వినేదెలా అని తలపట్టుకుంటోంది . అందుకే కాబోలు మీడియా ముందు అలాగే మనసుకి నచ్చింది ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ జపం చేసింది మంజుల .

అయితే పవన్ కళ్యాణ్ ఇటీవలే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్ళాడు , ఇప్పట్లో సినిమాల్లో నటించేది లేదని కూడా తేల్చి చెప్పాడు . 2019 లో ఎన్నికలు ఉన్నందున పార్టీ ని మరింతగా బలోపేతం చేయడానికి అలాగే కొన్నిచోట్ల అభ్యర్థులను నిలపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ . మరి ఈ పరిస్థితుల్లో మంజుల కు పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తాడా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న .