హీరో రాజ్ తరుణ్ తండ్రి కి మూడేళ్ళ జైలు శిక్ష


young hero rajtarun father sentenced 3 years jail యంగ్ హీరో రాజ్ తరుణ్ తండ్రి కి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది వైజాగ్ కోర్టు . సంచలనం రేపిన ఈ సంఘటన విశాఖపట్టణం లో జరిగింది . హీరో రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింహాచలం శాఖలో అసిస్టెంట్ క్యాషియర్ గా పనిచేస్తున్నాడు . అయితే 2013 లో నకిలీ బంగారాన్ని తన బ్యాంక్ లోనే తాకట్టు పెట్టి 9లక్షల 85 వేల రూపాయలను లోన్ గా తీసుకున్నాడు .

బ్యాంక్ లో ఉన్న బంగారాన్ని బ్యాంక్ ఉన్నతాధి కారులు చెక్ చేయగా బసవరాజు పెట్టిన బంగారం నకిలీదని తెలియడంతో అతడిపై కేసు పెట్టారు బ్యాంక్ ఉన్నతాధికారులు . ఈ కేసు కోర్టు కెక్కడంతో రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు కు మూడేళ్ళ జైలు శిక్ష విధించారు . మూడేళ్ళ జైలు శిక్ష తో పాటుగా 20 వేల జరిమానా కూడా విధించారు . రాజ్ తరుణ్ తండ్రి కి జైలు శిక్ష అని తెలియడంతో ఆ కుటుంబం తీవ్ర షాక్ కి గురయ్యింది .