దవడ పగులగొడతానని వార్నింగ్ ఇచ్చిన భామ


zareen khan fire on trolling personతనపై అకారణంగా అవాకులు చెవాకులు పేల్చుతున్న నెటిజన్ల దవడ పగులగొడతానని వార్నింగ్ ఇచ్చింది హాట్ భామ జరీన్ ఖాన్ . 23 ఏళ్ల ఓ యువకుడి గల్లా పట్టుకొని తన చేయి ని చూపిస్తూ దవడ పగులగొడతానని హెచ్చరించడమే కాకుండా మా ఒళ్ళు మా ఇష్టం మా శరీరం గురించి మాట్లాడటానికి మీరు ఎవరు ? మీకు ఏం హక్కుంది అంటూ చెడా మడా తిట్టేసింది ఎం టివి నిర్వహించిన ఓ షోలో .

దాంతో ఆ యువకుడు బిక్కచచ్చి పోగా నిర్వాహకులు సైతం జరీన్ ఖాన్ ఆగ్రహావేశాలను చూసి షాక్ అయ్యారట ! హీరోయిన్ లు రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను అప్ లోడ్ చేస్తున్నారు కాగా ఆ హాట్ ఫోటోలను చూస్తున్న నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తుండగా కొంతమంది శృతి మించి కామెంట్ చేస్తున్నారు . జరీన్ ఖాన్ ని కూడా తీవ్ర స్థాయిలో విమర్శించిన సదరు యువకుడి ని ఎం టివి వాళ్ళు ఓ షోకి పిలవగా జరీన్ ఖాన్ అతడ్ని చూడగానే రెచ్చిపోయి వార్నింగ్ లు ఇచ్చేసింది .