అఖిల్ సినిమా విషయంలో నాగ్ సూచనలు నిజమేనా?


అఖిల్ సినిమా విషయంలో నాగ్ సూచనలు నిజమేనా?
అఖిల్ సినిమా విషయంలో నాగ్ సూచనలు నిజమేనా?

అఖిల్ అక్కినేని.. ఎన్నో అంచనాలతో భారీ స్థాయిలో అఖిల్ ఎంట్రీ జరిగినా మొదటి సినిమా దారుణమైన పరాభవాన్ని మిగిల్చింది. అయితే రెండు, మూడు సినిమాలు కూడా అదే స్థాయిలో విఫలమవడంతో అఖిల్ హీరోగా ఇంకా మొదటి హిట్ ను సాధించలేదు. ప్రస్తుతం తన కెరీర్ లో నాలుగో చిత్రాన్ని చేస్తున్నాడు అఖిల్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయింది. నిజానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయాలనుకున్నారు కానీ కుదర్లేదు. లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమాల షూటింగ్ లతో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది.

అయితే ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతులు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీలైనంత తొందర్లో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి ఈ ఏడాదిలోనే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. పూజ హెగ్డే ఈ చిత్రానికి కథానాయిక. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ పై అంచనాలు అయితే బాగానే ఉన్నాయి. క్రేజ్ కు తగ్గట్లు సినిమా ఆడితే అఖిల్ కు మొదటి హిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ చిత్రానికి సంబంధించి తాజా సమాచారం ఏమిటంటే లాక్ డౌన్ సమయంలో రీసెంట్ గా నాగ్ ఈ సినిమా చూడటం జరిగిందట. సినిమా రషెస్ చూసిన నాగ్ కు కొన్ని డౌట్స్ ఉన్నాయని, సినిమా అంతా నచినప్పటికీ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీక్వెన్స్ లపై దర్శకుడి వద్ద తన డౌట్స్ ను వెల్లడించినట్లు సమాచారం. దర్శకుడు కూడా వాటికి ఏకీభవించి షూటింగ్ తిరిగి మొదలయ్యే సరికి మార్పులతో వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. మరి వీటిలో నిజమెంతుందో ఆ టీమ్ కే తెలియాలి.