అల్లు అర్జున్ తిట్లతో ఆగిన షూటింగ్


Allu Arjun fires on Trivikram co- director
Allu Arjun fires on Trivikram co- director

అల్లు అర్జున్ తిట్లతో ఆగిన షూటింగ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సీనియర్ కో డైరెక్టర్ ని సెట్ లో తిట్టాడట ! దాంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ సినిమా షూటింగ్ ఆగిపోయిందట . ఇక అల్లు అర్జున్ తిట్టడంతో ఆ కో డైరెక్టర్ చాలా బాధపడ్డాడట . ఆ బాధతో ఒక దశలో ఆవేశానికి లోనై ఫిర్యాదు కూడా చేద్దామనుకున్నాడట ! కానీ ఆవేశం చల్లారింది అలాగే త్రివిక్రమ్ సలహా మేరకు సైలెంట్ అయిపోయాడట .

అయితే సకాలంలో జరగాల్సిన షూటింగ్ మాత్రం ఆగిపోయింది . త్రివిక్రమ్ జోక్యంతో మళ్ళీ రెండు మూడు రోజుల్లోనే షూటింగ్ సెట్స్ మీదకు వెళ్లనుందట . అల్లు అర్జున్ ఆ కో డైరెక్టర్ పై ఎందుకు ఆగ్రహించాడో మాత్రం పూర్తిగా తెలియరాలేదు . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం షూటింగ్ మాత్రం మళ్ళీ జరుగబోతోంది . అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు విజయవంతం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి మరి .