ఎన్టీఆర్ పై చెప్పులేసినపుడు ఏం చేసావ్ మోహన్ బాబు !


1995 లో వైస్రాయ్ హోటల్ ముందు ఎన్టీఆర్ పై చెప్పులు వేయించింది చంద్రబాబు నాయుడు అందుకు సాక్ష్యం నేనే అంటూ సినీ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేసాడు . ఈరోజు మంగళగిరి లో లోకేష్ బాబు కి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వెళ్లిన మోహన్ బాబు అక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబుని తూర్పార బట్టాడు . 
 
పనిలో పనిగా ఎన్టీఆర్ పై చెప్పులు వేయించింది చంద్రబాబు ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు అంతా బాగానే ఉంది కానీ చంద్రబాబు నిజంగానే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడు అనుకుందాం ……. ఆ సమయంలో మోహన్ బాబు చంద్రబాబు వెంటే ఉన్నాడు . పైగా వైస్రాయ్ హోటల్ ముందు ఎన్టీఆర్ పై చెప్పులు వేయిస్తుంటే చూస్తుండి పోయాడు తప్ప ఆపలేదే ! అప్పుడే ఈ విషయం చెప్పలేదే ! ఖండించనూ లేదే ! దాదాపు 25 ఏళ్లకు ఇప్పుడు చంద్రబాబు చెప్పులు వేయించాడు అని చెబుతున్నాడంటే మోహన్ బాబు ని ఎలా అర్ధం చేసుకోవాలి .. ….. ఎలా నమ్మాలి .