`గాలి సంప‌త్` కూడా డేట్ ఇచ్చేశాడు!

Gaali Sampath Worldwide Release On March 11
Gaali Sampath Worldwide Release On March 11

బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పిస్తూ స్క్రీ‌ప్లేతో పాటు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న చిత్రం `గాలి సంప‌త్‌`. అనీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ‌విష్ణు హీరోగా న‌టిస్తున్నారు. ల‌వ్‌లీ సింగ్ హీరోయిన్. డా. రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. అనిల్ రావిపూడి మిత్రుడు, కో డైరెక్ట‌ర్ ఎస్‌. కృష్ణ ఈ చిత్రం ద్వారా నిర్మాత‌గా మారుతున్నారు.

విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతున్న ఈ మూవీ మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎస్‌.కృష్ణ మాట్లాడుతూ `నా మిత్రుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న `గాలి సంప‌త్‌` షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి చిత్రాన్ని మార్చి 11న మ‌హా శివ‌రాత్రి కానుక‌గా విడుద‌ల చేస్తున్నాం` అన్నారు.

న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో త‌నికెళ్ల భ‌ర‌ణి, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్రరెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ల్యాణీ, సాయి శ్రీ‌నివాస్‌, రూప‌ల‌క్ష్మి తదిత‌రులు న‌టిస్తున్నారు. క‌థ‌, ఎస్ . కృష్ణ‌, ర‌చ‌నా స‌హ‌కారం ఆదినారాయ‌ణ రావు, సినిమాటోగ్ర‌ఫీ సాయి శ్రీ‌రామ్‌, సంగీతం అచ్చు రాజ‌మ‌ణి, ఆర్ట్ ఏ.ఎస్‌. ప్ర‌కాష్‌. మాట‌లు మిర్చి కిర‌ణ్‌. పాటలు రామ‌జోగ‌య్య శాస్త్రి,