గెలుపు కోసం కష్టపడుతున్న మహేష్ బావ


హీరో మహేష్ బాబు బావ గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ గెలుపు కోసం కష్టపడుతున్నాడు . అధికార తెలుగుదేశం పార్టీ తరుపున మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ పోటీ చేస్తుండగా వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నాడు . విచిత్రం ఏంటంటే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కావడం .

ఇటీవలే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి జగన్ పార్టీలో చేరాడు . మోదుగుల పార్టీలో చేరడమే ఆలస్యం గుంటూరు పార్లమెంట్ స్థానం కేటాయించాడు జగన్ . మోదుగుల బలమైన నేత కావడంతో గల్లా జయదేవ్ చెమటోడ్చుతున్నాడు గెలుపు కోసం . నిన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడుతుండటంతో గుంటూరు రాజకీయం రసవత్తరంగా మారింది . ఇక బావ గెలుపు కోసం మహేష్ ప్రచారం చేస్తాడా ? అంటే చేయడు . గతంలో కూడా బావ తరుపున మహేష్ ప్రచారం చేయలేదు కాకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్న తన అభిమానులను మాత్రం బావకు అండగా ఉండమని , ప్రచారంలో పాల్గొనమని చెప్పాడట మహేష్ . తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉన్న ఈ సమయంలో గల్లా జయదేవ్ గెలుస్తాడా ? అన్నది చూడాలి .