తండ్రి కోసం కష్టపడుతున్న నిహారిక


తండ్రి నాగబాబు గెలుపు కోసం ఎర్రటి ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రచారం చేస్తోంది మెగా డాటర్ నిహారిక . నాగబాబు జనసేన తరుపున నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . నరసాపురం పార్లమెంట్ స్థానంలో కాపులు పెద్ద ఎత్తున ఉన్నారు దాంతో నాగబాబు నరసాపురం నుండి పోటీ చేస్తున్నాడు .

ఎన్నికలు సమీపించడంతో తన సినిమా ప్రమోషన్ లను పూర్తిచేసి ఎన్నికల ప్రచార రంగంలోకి దిగింది నిహారిక . నరసాపురం పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేయడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకుంది నిహారిక . హీరోయిన్ కావడంతో నిహారిక ని చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు . ప్రజల నుండి స్పందన ఎక్కువగా వస్తుండటంతో నాగబాబు గెలుపు ఖాయమని ధీమాగా ఉంది నిహారిక . ఏప్రిల్ 11 న పోలింగ్ జరుగనుంది ఇక ఫలితాలు మే 23న రానున్నాయి .