బుల్ రెడ్డి అంటూ కుర్రాళ్ళని రెచ్చగొడుతున్న పాయల్


హాట్ భామ పాయల్ రాజ్ పుత్ బుల్ రెడ్డి అంటూ కుర్రాళ్ళని రెచ్చగొడుతోంది . తాజాగా పాయల్ రాజ్ పుత్ బుల్ రెడ్డి లిరికల్ వీడియో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో . అంతా రెడ్డి జపం చేస్తూ సాగే ఈ పాట యువతని విశేషంగా అలరించడం ఖాయం ఎందుకంటే ఒకవైపు పాయల్ రాజ్ పుత్ అందాలు మరోవైపు ఫాస్ట్ బీట్ తో సాగే బుల్ రెడ్డి పాట . ఈ పాటలో పాయల్ రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది .

బెల్లంకొండ సాయి శ్రీనివాస్కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీత . పేరుకి సీత టైటిల్ అయినప్పటికీ మోడ్రన్ గా ఉండే అమ్మాయి కథ అన్నమాట ! కథ విషయం పక్కన పెడితే పాయల్ రాజ్ పుత్ కేవలం ఐటెం సాంగ్ మాత్రమే చేస్తోంది ఈ సినిమా కోసం . ఈరోజు బుల్ రెడ్డి లిరికల్ వీడియో రిలీజ్ చేసారు . ఆ వీడియో వైరల్ అవుతోంది ఎందుకంటే మాస్ మసాలా సాంగ్ కాబట్టి . పాయల్ అందాల కోసం ఈ పాట కోసం ఎగబడుతున్నారు కుర్రాళ్ళు .