బైక్ ఎక్కిన గజ్జెల గుఱ్ఱం


payalrajput- rx100
ఆర్ ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన భామ పాయల్ రాజ్ పుత్ . తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ”సీత ” చిత్రం కోసం గజ్జెల గుఱ్ఱం లా తయారై బైక్ మీద కూర్చొని సవారీ చేస్తూ కుర్రకారుని పిచ్చెక్కించింది . అసలే అందమైన భామ ఆపై ఎద అందాలు మాత్రమే కాకుండా పిక్కల బలం కూడా చూపిస్తూ కవ్విస్తుంటే పాయల్ అందాలను తదేకంగా చూస్తుండి పోతున్నారు కుర్రాళ్ళు . 
 
కాజల్ అగర్వాల్ – బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జంటగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ” సీత ” . అయితే ఆ చిత్రంలో కుర్రాళ్ళ కోసం పాయల్ రాజ్ పుత్ చేత ఐటెం సాంగ్ చేయిస్తున్నాడు దర్శకులు తేజ . ఆ చిత్రం కోసం యమహా బైక్ పై కూర్చొని గజ్జెల గుర్రం లా ఫోజు ఇచ్చిన భామే ఈ పాయల్ . ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ఉంది , అంత హాట్ గా ఉంది మరి పాయల్ . సీత చిత్రాన్ని ఈనెల 25 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . సినిమా రిలీజ్ అయ్యాక పాయల్ రాజ్ పుత్ పాట స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది స్టిల్ చూస్తుంటే .