మలైకా పెళ్లి గురించి మాజీ మొగుడు ఏమన్నాడో తెలుసా


45 ఏళ్ల వయసులో మళ్ళీ రెండో పెళ్ళికి సిద్ధమైంది హాట్ భామ మలైకా అరోరా . దాంతో మలైకా మాజీ భర్త అర్భాజ్ ఖాన్ ని మలైకా రెండో పెళ్లి గురించి అడగ్గా ఏమన్నాడో తెలుసా …… మలైకా రెండో పెళ్లి గురించిన ప్రశ్న నన్ను అడగడానికి మీరు కొంచెం సమయం తీసుకున్నారు కదా ! అలాగే నేను కూడా ఒకరోజు సమయం తీసుకొని రేపు చెబుతా నా సమాధానం అంటూ షాక్ ఇచ్చాడు అర్భాజ్ ఖాన్ .

1998 లో అర్భాజ్ ఖాన్ – మలైకా అరోరా ల పెళ్లి జరిగింది . దాదాపు 19 ఏళ్ల పాటు కాపురం సాగింది కాగా ఆ కాపురానికి గుర్తుగా 14 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు . అయితే గత ఏడాది మలైకా అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చింది . అప్పటి నుండి కూడా అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తూనే ఉంది . ఏప్రిల్ 19 న మలైకా – అర్జున్ లు పెళ్లి చేసుకోబోతున్నారు . దాంతో మాల్దీవులకు వెళ్లి అప్పుడే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు కూడా .