మళ్ళీ జగన్ పంచన చేరిన రాజశేఖర్ దంపతులువై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఆ పార్టీ నుండి వెళ్ళిపోయిన సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ , జీవిత లు మళ్ళీ ఈరోజు జగన్ సమక్షంలో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు . అంతేకాదు ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అంటూ ప్రచారం కూడా మొదలు పెట్టారు . ఇప్పుడున్న వాళ్లంతా దొంగలేనని అయితే జగన్ కొద్దిగా బెటర్ అంటూ నోరు జారారు రాజశేఖర్ దంపతులు .

తెలుగుదేశం , కాంగ్రెస్ , లక్ష్మీపార్వతి తెలుగుదేశం , వై ఎస్సార్ కాంగ్రెస్ , భారతీయ జనతా పార్టీ ఇలా పెద్ద లిస్టే ఉంది రాజశేఖర్ – జీవితలు మారిన పార్టీలు . ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో చంద్రబాబు పై ముప్పేట దాడి మొదలయ్యింది అందునా సినిమా రంగం నుండి . ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు జగన్ పార్టీలో చేరగా తాజాగా రాజశేఖర్ దంపతులు మరోసారి జగన్ పంచన చేరారు . అయితే ఇందులో రాజశేఖర్ – జీవిత లు ఎంతకాలం ఉంటారో చూడాలి .