మహర్షి టీజర్ కు రంగం సిద్ధం


మహేష్ బాబు తాజాగా నటిస్తున్న మహర్షి చిత్ర టీజర్ కు రంగం సిద్ధమైంది . ఈనెల 6న ఉగాది పర్వదినం కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఉదయం 9 గంటల 9 నిమిషాలకు మహర్షి టీజర్ ని రిలీజ్ చేయడనికి సుముహూర్తం నిర్ణయించారు . యాక్షన్ తో పాటుగా సెంటిమెంట్ ని రంగరించి ఈ టీజర్ ని కట్ చేశారట ! మహేష్ కు కూడా ఈ టీజర్ బాగా నచ్చడంతో ఇక రిలీజ్ చేయడమే తరువాయి అన్నట్లుగా ఉంది పరిస్థితి .

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న మహర్షి చిత్రాన్ని మే 9 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక ఈ సినిమా కు ఒక్క ఓవర్ సీస్ తప్ప మిగతా అన్ని ఏరియాల నుండి మంచి బిజినెస్ జరుగుతోంది . శాటిలైట్ , డిజిటల్ , హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో 53 కోట్లు వచ్చాయి మహర్షి చిత్రానికి . మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా అల్లరి నరేష్ కూడా కీలక పాత్రలో నటించాడు .