మే 31న రిలీజ్ కానున్న 5 చిత్రాలు


ఈవారం కూడా పోయింది , గత శుక్రవారం వచ్చిన 6 చిత్రాలు ప్లాప్ జాబితాలో పడిపోయాయి దాంతో మే 31 న మరో 5 చిత్రాలు విడుదలకు సిద్ధం అయ్యాయి . మే 31 న విడుదల అవుతున్న చిత్రాల్లో తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ” ఎన్ జి కే ” ప్రథమ స్థానంలో ఉంది దాని తర్వాత ఫలక్ నుమా దాస్ అనే తెలుగు చిత్రం కూడా పోటీ పడుతోంది విజయం కోసం . అలాగే అభినేత్రి 2 , సువర్ణ సుందరి , ఇంగ్లీష్ డబ్బింగ్ గాడ్జిల్లా చిత్రాలు విడుదల అవుతున్నాయి .

అయితే పోటీ ప్రధానంగా ఫలక్ నుమా దాస్ , సూర్య ఎన్ జి కే ల మద్యే ఉండనుంది . ఎందుకంటే సూర్య స్టార్ హీరో పైగా తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టగల హీరో . ఆలాగే టీజర్ , ట్రైలర్ లతో ఫలక్ నుమా దాస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి దాంతో సక్సెస్ కోసం ఈ రెండు చిత్రాలు పోటీ పడనున్నాయి. ఇక మిగతా చిత్రాలకు అంతగా బజ్ లేదు . ప్రతీవారం చిత్రాలు వస్తున్నాయి అలాగే పోతున్నాయి కానీ సరైన బ్లాక్ బస్టర్ మాత్రం బాక్సాఫీస్ కు దక్కడం లేదు పాపం .