మోహన్ బాబుని చీపుర్లతో తరిమికొట్టారటనిమ్స్ ఆసుపత్రిలో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మోహన్ బాబు ని చీపుర్లతో తరిమికొట్టారని సంచలన వ్యాఖ్యలు చేసింది తెలుగుదేశం పార్టీ నాయకురాలు అనురాధ . కొద్దిరోజులుగా మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ మీద అలాగే చంద్రబాబు నాయుడు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది అనురాధ .

నువ్ మనిషివా ? మోహన్ బాబువా ? అనే సామెత ఎలా పుట్టిందో తెలుసుకోవాలని మోహన్ బాబుకు చురకలంటించింది అంతేకాదు ఎయిర్ హోస్టెస్ తో అసభ్యకరంగా ప్రవర్తించిన చరిత్ర నీది ,నటి జయంతి చేతిలో చెప్పుదెబ్బలు తిన్న ఘనత నీది , మహిళ అని చూడకుండా సాక్షి శివానంద్ చెల్లెలు పై చేయి చేసుకున్న వాడివి నువ్వు . ఓ మీడియా ఛానల్ మీదకు తుపాకీ పట్టుకొని వెళ్లినవాడివి నువ్వు …… నువ్వా ? చంద్రబాబుని విమర్శించేది నీతులు చెప్పేది అంటూ తీవ్ర పదజాలంతో దూషించింది అనురాధ . మోహన్ బాబు ని విమర్శించాలంటే సహజంగానే జంకుతారు కానీ ఓ మహిళా నేత మాత్రం మోహన్ బాబు ని ఓ ఆట ఆడేసుకుంది .