రాజమౌళికి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్, చరణ్


rrr-ramcharan-ntr
ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కి షాక్ ఇచ్చారు ఆర్ ఆర్ ఆర్  చిత్ర బృందం .  ఎన్టీఆర్ , చరణ్ లు ఆర్ ఆర్ ఆర్  షూటింగ్ లో పాల్గొన్న సమయంలో లొకేషన్ లో ఫోన్ లు పనిచేయకుండా , ఎన్టీఆర్ , చరణ్ లుక్ బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రాజమౌళి . అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి సంబందించిన ఏదో ఒక స్టిల్ , వీడియో బయటకు లీక్ అవుతూనే ఉంది . 
 
తాజాగా చరణ్ , ఎన్టీఆర్ లు స్కూటీ పై వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఆన్ లొకేషన్ లో ఎన్టీఆర్ , చరణ్ లు ఎలా ఉంటారో చూడాలని ఉత్సాహపడే వాళ్లకు ఈ వీడియో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా అయ్యింది . ఇంకేముంది చరణ్ , ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోటీపడి మరీ ఆ వీడియోలను షేర్ చేస్తున్నారు . 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు , తమిళ , మలయాళ , హిందీ బాషలలో ఆర్ ఆర్ ఆర్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే .