హిట్టు కోసం మెట్లు ఎక్కిన సమంత


Samantha-at-tirumala
తన భర్త అక్కినేని నాగచైతన్య తో కలిసి సమంత  నటించిన చిత్రం ” మజిలీ ”. అయితే ఈ సినిమా హిట్టు కోసం తిరుమల మెట్లు ఎక్కింది సమంత . నిన్న సాయంత్రం కాలినడకన సమంత తిరుమల చేరుకుంది . సమంత వెంట బృందం పాల్గొనగా నాగచైతన్య మాత్రం కాలినడకన  మెట్ల మార్గంలో కాకుండా హాయిగా కారులో కొండపైకి చేరుకున్నాడు . కానీ సమంత మాత్రం తన భర్తకు మంచి హిట్ రావాలి అంటూ కొండపైకి మెట్లు ఎక్కింది . 
 
తెల్లవారు ఝామున తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శనం చేసుకుంది సమంత . ఈనెల 5 న సమంత – నాగచైతన్య నటించిన మజిలీ చిత్రం రిలీజ్ అవుతోంది . సమంత కు హిట్స్ కొత్త కాదు కానీ నాగచైతన్య కు మాత్రం సరైన హిట్స్ లేవు అలాగే ఇటీవల రిలీజ్ అయిన చిత్రాలు వరుసగా దెబ్బకొట్టాయి కూడా . పెళ్ళి తర్వాత సమంత – చైతూ కలిసి నటించిన చిత్రం కావడంతో మజిలీ పై మంచి అంచనాలే ఉన్నాయి మరి . సమంత మొక్కు ఫలిస్తుందో లేదో తెలియాలంటే ఈనెల 5 వరకు ఎదురు చూడాల్సిందే.