`ఆదిపురుష్` కోసం 60 వ‌ర్కింగ్ డేస్‌?


`ఆదిపురుష్` కోసం 60 వ‌ర్కింగ్ డేస్‌?
`ఆదిపురుష్` కోసం 60 వ‌ర్కింగ్ డేస్‌?

ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం ` రాధేశ్యామ్‌`. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై కె. రాధాకృష్ణ‌కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మేజ‌ర్ షెడ్యూల్స్ పూర్తి చేశారు. త్వ‌ర‌లో కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ చేయ‌డానికి స్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా స్థాయి చిత్రాల్ని అంగీక‌రిస్తున్నారు.

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సైన్స్ ఫిక్ష‌న్‌ని అంగీక‌రించిన ప్ర‌భాస్ ఆ వెంట‌నే బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శక‌త్వంలో `ఆది పురుష్‌` పేరుతో రూపొంద‌నున్న భారీ చిత్రాన్ని అంగీక‌రించారు. టి సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ మొద‌లుపెట్టిన ద‌ర్శ‌కుడు రావ‌ణాసుడి పాత్ర కోసం సైఫ్ అలీఖాన్‌ని ఎంపిక చేశారు.

ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్‌ని జ‌న‌వ‌రి నుంచి ప్రారంభించ‌బోతున్నారు. దీని కోసం రెండు షెడ్యూల్స్ కి 60 వ‌ర్కింగ్ డేస్ కేటాయించ‌బోతున్నార‌ట‌. తెల‌గు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ కానున్న ఈ ప్రాజెక్ట్ కోసం సీత‌, హ‌నుమంతుడు వంటి కీల‌క పాత్రల్ని ఎంపిక చేయ‌బోతున్నారు.