క‌ల్యాణ్‌రామ్ హీరోయిన్ పెళ్లైపోయింది!


క‌ల్యాణ్‌రామ్ హీరోయిన్ పెళ్లైపోయింది!
క‌ల్యాణ్‌రామ్ హీరోయిన్ పెళ్లైపోయింది!

క‌ల్యాణ్‌రామ్ హీరోగా న‌టించిన `క‌ల్యాణ్‌రామ్ క‌త్తి` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది స‌నాఖాన్‌. ఆ త‌రువాత నాగార్జున `గ‌గ‌నం, మంచు మ‌నోజ్ `మిస్ట‌ర్ నూక‌య్య‌` వంటి చిత్రాల్లో న‌టించింది. కానీ తెలుగులో పెద్ద‌గా రాణించ‌లేక‌పోయింది. ఆ త‌రువాత బాలీవుడ్‌కు వెళ్లిపోయిన స‌నాఖాన్ ఇటీవ‌ల బిజినెస్‌మెన్ అనాస్ స‌య్య‌ద్‌ని వివాహం చేసుకుంది.

సైలెంట్‌గా వివాహం చేసుకున్న స‌నాఖాన్ ఆదివారం త‌న పెళ్లి ఫొటోని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. పెళ్లి త‌రువాత స‌నా ఖాన్ చాలా మారిపోయింది. ఆధ్య‌త్మికత ఆమెలో పెరిగిన‌ట్టు క‌నిపిస్తోంది. గ‌తంలో ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన గ్లామ‌ర్ ఫొటొల‌ని తొలిగించింది. అంతే కాకుండా త‌ను న‌ట‌న‌కు శాశ్వ‌తంగా గుడ్‌బై చెబుతున్నాన‌ని స్పష్టం చేసింది.

ఎన్టీఆర్ నటించిన `టెంప‌ర్‌` చిత్రాన్ని విశాల్ హీరోగా త‌మిళ్లో `అయేగ్య‌` పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంలోని స్పెష‌ల్ ఐట‌మ్ సాంగ్‌లో స‌‌నా ఖాన్ న‌టించింది. ప్ర‌స్తుతం ఆమె న‌టిస్తున్న హిందీ చిత్రం `టోమ్ డిక్ హారీ 2`. 2006లో వ‌చ్చిన `టోమ్ డిక్ హారీ` చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీ రూపొందుతోంది.