100 కోట్ల బడ్జెట్ రికవరీ సాధ్యమా ?


దగ్గుబాటి రానా హీరోగా హిరణ్య కశ్యప అనే భారీ చిత్రానికి శ్రీకారం చుట్టాడు దర్శకుడు గుణశేఖర్. ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా………. 100 కోట్లు . వంద కోట్ల భారీ బడ్జెట్ అంటే రికవరీ సాధ్యమా ? పూర్తిగా డౌటే ఎందుకంటే రానా కు మంచి నటుడిగా గుర్తింపు ఉంది అందులో అనుమానం లేదు అలాగే పలు భాషల్లో విడుదల కూడా చేయొచ్చు కానీ స్టార్ హీరోల మాదిరిగా మార్కెట్ లేదు . హీరోకు మార్కెట్ లేదు కనీసం దర్శకుడి కైనా మార్కెట్ ఉందా ? అంటే అదీ లేదు . ఇద్దరికీ మార్కెట్ లేకుండా వంద కోట్ల సినిమా అంటే పెద్ద రిస్క్ చేయడమే.

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాల్లో ఎక్కువగా భారీ బడ్జెట్ చిత్రాలే దాంతో రికవరీ లో మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు ఇప్పటి వరకు. ఇక రుద్రమదేవి అనే చిత్రాన్ని తీసి విమర్శల పాలయ్యాడు గుణశేఖర్. అయితే కొంతవరకు భారీ వసూళ్ల నే రాబట్టింది ఆ సినిమా కానీ పెరిగిన బడ్జెట్ కారణంగా గుణశేఖర్ నష్టపోవాల్సి వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న గుణశేఖర్ సక్సెస్ లు సాధించాడు కానీ ఓవర్ బడ్జెట్ కారణంగా కొంత నిరాశపరిచాయి. మరి 100 కోట్ల సినిమా రానా – గుణశేఖర్ ల కాంబినేషన్ లో వర్కౌట్ అవుతుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే !