ఆ సినిమాకు వెయ్యి కోట్ల బడ్జెట్ అట


1000 crores movie launched

వెయ్యి కోట్లతో మహాభారతం లోని కీలక ఘట్టం ని తెరకెక్కించనున్నామని అధికారిక ప్రకటన విడుదల చేసాడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ . దుబాయ్ కి చెందిన బిఆర్ శెట్టి అనే ధనవంతుడు ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చాడు . మోహన్ లాల్ భీముడిగా నటించనున్నాడట ఈ చిత్రంలో . వెయ్యి కోట్ల బడ్జెట్ అంటే ఆసియాలోనే అతిపెద్ద బడ్జెట్ అన్నమాట ! ఇంతవరకు ఈ స్థాయి బడ్జెట్ తో ఆసియాలో ఏ సినిమా రూపొందలేదు . తెలుగు , తమిళ్ , మలయాళ , హిందీ భాషలతో పాటుగా ఆంగ్లం లో కూడా రూపొందించనున్నట్లు తెలుస్తోంది .

మోహన్ లాల్ తో పాటు పలు చిత్ర రంగాలకు చెందిన వాళ్ళను ఇతర పాత్రల్లో తీసుకొవడానికి ఎప్పుడో ప్రయత్నాలు చేసారు అయితే ఇన్నాళ్లు ఇంతటి బడ్జెట్ పెడితే వర్కౌట్ అవుతుందా అని చూసారు కట్ చేస్తే బిఆర్ శెట్టి ధైర్యం చేసి కదనరంగంలోకి దిగుతున్నాడు . టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది అయితే శ్రీ కృష్ణడు పాత్ర లేక కర్ణుడా అన్నది త్వరలో తేలనుంది . వెయ్యి కోట్ల బడ్జెట్ అంటే దాదాపు రెండు వేల కోట్లు వసూల్ చేయాలి మరి ఆ స్థాయి వసూళ్లు వస్తాయా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న . నిన్న మంచి రోజు కావడంతో ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రారంభమైంది . ఇక రెగ్యులర్ షూటింగ్ మాత్రం కొంత సమయం తీసుకొని చేయనున్నారు .

English Title: 1000 crores movie launched