118 తో కళ్యాణ్ రామ్ హిట్ కొడతాడా ?


118 telugu film trailer talk

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కంటే మంచి మనసున్న వ్యక్తి . సినిమారంగంలో కుటుంబ నేపథ్యంతో కాకుండా  మంచి పేరు సంపాదించుకున్నాడు అయితే ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోయారు . అతనొక్కడే , పటాస్ లాంటి చిత్రాలు తప్ప మిగతా చిత్రాలు అంతగా ఆడలేదు దాంతో ఆశించిన స్థాయిలో స్టార్ డం ని పొందలేకపోయాడు . కట్ చేస్తే తాజాగా 118 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు కళ్యాణ్ రామ్ .

 

నిన్న రిలీజ్ అయిన 118 చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తోంది అలాగే సినిమాపై అంచనాలను పెంచింది కూడా . సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో తప్పకుండ కళ్యాణ్ రామ్ హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . 118 చిత్రం మార్చి 1 న విడుదలకు సిద్ధం అవుతోంది . మహేష్ కోనేరు నిర్మించిన ఈ చిత్రానికి కెవి గుహన్ దర్శకత్వం వహించాడు . హీరోయిన్ లుగా అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే , నివేదా థామస్ లు నటించారు .

English Title: 118 telugu film trailer talk