సినిమా హాళ్ళో అమ్మాయిపై అత్యాచారం


13 years girl raped by sweeper in hyderabad theatre

హైదరాబాద్ లోని బోరబండ థియేటర్ ఆవరణలో ఓ అమ్మాయి పై అత్యాచారం చేసిన సంఘటన సంచలనం సృష్టించింది . బోరబండ లోని విజేత థియేటర్ లో ప్రశాంత్ (25) అనే యువకుడు స్వీపర్ గా పనిచేస్తున్నాడు . అయితే అదే థియేటర్ కు మంచి నీళ్ల కోసం కొంతకాలంగా వస్తోంది 13 ఏళ్ల అమ్మాయి . ఆ బాలిక మంచి నీళ్ల కోసం తరచుగా వస్తుండటం తో ఆమె పై కన్నేశాడు కామాంధుడు ప్రశాంత్ . నిన్న యధావిధిగా బాధిత బాలిక తో పాటు ఆమె వదిన కూడా మంచి నీళ్ల కోసం వచ్చింది . అయితే బాధిత బాలిక వదిన మంచి నీళ్లు తీసుకొని పోగా బాలిక అక్కడే ఉండటంతో ఆమెని సమీపంలోని బాత్ రూమ్ లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసాడు .

ఆమె అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేయడంతో బాలిక ఈ విషయాన్నీ తన తల్లిదండ్రులకు చెప్పింది . దాంతో పోలీసులను ఆశ్రయించారు . బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రశాంత్ అరెస్ట్ చేసి రిమాండ్ చేసారు . అభం శుభం తెలియని బాలికపై అత్యాచారం జరిగిందని తెలియడంతో థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి . సకాలంలో పోలీసులు రంగప్రవేశం చేసి యధాస్థితి నెలకొనేలా చేసారు . రోజురోజుకి దేశంలో అత్యాచారాలు పెరిగిపోతుండటంతో నిందితుడి ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మహిళా సంఘాలు .