ఏపీలో 132కు చేరిన క‌రోనా పాజిటివ్ కేసులు!


ఏపీలో 132కు చేరిన క‌రోనా పాజిటివ్ కేసులు!
ఏపీలో 132కు చేరిన క‌రోనా పాజిటివ్ కేసులు!

ఏపీలో ఏం జ‌రుగుతోంది. ఒక్క సారిగా అక్క‌డ క‌రోనా పాజిటివ్ కేసులు పెర‌గ‌డానికి కార‌ణం ఎవ‌రు? ఏంటీ? .. ఢిల్లీ నిజామోద్దీన్ వెళ్లి వ‌చ్చి వాళ్లే ఈ సంఖ్య పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌కులుగా మారుతున్నారా? అంటే మారుతున్న ప‌రిస్థితులు అందుకు అద్దంపుతున్నాయి. ఏపీలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. గురువారం ఒక్క‌రోజే అక్క‌డ 21 పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. గురువారం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక బులిటెన్‌ని విడుద‌ల చేసింది.

గురువారం ఒక్క‌రోజే 21 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్టు వెల్ల‌డించింది. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 20 చొప్పున, ప్ర‌కాశం జిల్లాలో 17, క‌డ‌ప‌, కృష్ణా జిల్లాల్లో 15 చొప్పున, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 14, విశాఖ జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 8, తూర్పు గోదావ‌రి జిల్లాలో 9, అనంత‌పురంలో 2 క‌రోనా పాజిటివ్ కేసులు నమోద‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 1800 మంది న‌మూనాలు ప‌రీక్షించ‌గా 1175 మందికి నెగెటివ్ వ‌చ్చింది. ఇందులో 493 మంది ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్న‌ట్టు ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఏపీలో భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలో పాజిటివ్ కేసు న‌మోదు కావ‌డంతో అక్క‌డ రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించిన అధికారులు అల‌ర్ట్ అయిన‌ట్టు తెలిసింది. ప‌ట్ట‌ణంలోని టిప్ప‌ర్ల బ‌జార్‌లోని ఓ వ్య‌క్తికి (65)కి క‌రోనా వైర‌స్ నిర్థార‌ణ కావ‌డంతో అత‌ని నివాసం నుంచి 3కిలోమీట‌ర్ల వ‌ర‌కు అధికారులు రెడ్ జోన్‌గా ప్ర‌క‌టించారు. స‌మీపంలో వున్న దుకాణాల‌ను, కూర‌గాయ‌ల మార్కెట్‌ల‌ను మూసివేయించారు, ఆ ప్రాంతంలో 144 సెక్ష‌న్‌ని విధించారు. ఢిల్లీ నిజాముద్దీన్‌కు వెళ్లి వ‌చ్చిన వారి వ‌ల్లే ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిన‌ట్టు అధికారుల చెబుతున్నారు.