ఊచకోత కోస్తున్న వినయ విధేయ రామ ట్రైలర్


15 Million views for Ramcharan's Vinaya Vidheya Rama Trailer
Ramcharan

యు ట్యూబ్ లో వినయ విధేయ రామ ఊచకోతకోస్తోంది . రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు . జనవరి 11 న విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే . ట్రైలర్ విడుదల అవ్వడమే ఆలస్యం మెగా అభిమానుల ఆదరణతో రికార్డుల మోత మోగిస్తోంది ట్రైలర్ . ఇప్పటికే ఈ ట్రైలర్ 15 మిలియన్ వ్యూస్ ని బద్దలు కొట్టింది .

ఊర మాస్ ని తలపించేలా ఉన్న ఈ ట్రైలర్ యు ట్యూబ్ ని ఊచ కోత కోస్తోంది . మాస్ జనాలకు పిచ్చ పిచ్చగా నచ్చేలా ఉంది వినయ విధేయ రామ ట్రైలర్ . బోయపాటి మాస్ దర్శకులు కావడంతో మాస్ ని అలరించే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు . ట్రైలర్ లో రాంచరణ్ రాంబో ని తలపించాడు దాంతో మెగా అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి . చరణ్ సరసన కైరా అద్వానీ నటించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించాడు . జనవరి 11న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు .

English Title: 15 Million views for Ramcharan’s Vinaya Vidheya Rama Trailer